మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లైశెట్టి శేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.ఏ. మోఖీద్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నిరంతర శ్రమ, అంకితభావంతో విధినిర్వహణ చేస్తున్న లైశెట్టి శేఖర్, అల్లీపూర్ గ్రామ అభివృద్ధికి అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వినయ్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ రాచమడుగు సాగర్ రావు, వార్డ్ సభ్యులు కల్లెడ గంగాధర్, సుతారి రోజా, జాగిరి ప్రశాంత్, అట్కాపురం గంగశేఖర్, బర్ల చంద్రశేఖర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దొబ్బల వేణు, జీపీఓ నరేష్, కారోబర్ బత్తుల రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ సాగర్, నాయకులు ఏజాస్, గంగరాజాం, పవన్, జలందర్, తదితరులు పాల్గొన్నారు.












