హనుమకొండ, 2026-08-11
హనుమకొండ సుబేదారిలోని ఆవోపా భవనంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ మండల అధ్యక్షుడిగా అంచూరి విజయ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
హనుమకొండ సుబేదారిలోని ఆవోపా భవనంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ మండల అధ్యక్షుడిగా అంచూరి విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎలుగూరి శివకుమార్, కోశాధికారిగా పుల్లూరి వెంకన్నతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
పేదల అభ్యున్నతికి కృషి
అనంతరం నూతన అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి సమాజ హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు విద్య, వైద్యం, దేవస్థానాల్లో వసతి సౌకర్యం, విద్యార్థులకు హాస్టల్ వసతి, ఫీజుల విషయంలో సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. అలాగే నూతన సభ్యత్వ నమోదు చేపట్టి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
సమాజ శ్రేయస్సే లక్ష్యం
బాధలో ఉన్న వారికి అందించే సహాయం దేవుడికి సమర్పించే నైవేద్యంతో సమానమని పేర్కొంటూ, సమాజ శ్రేయస్సే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తోట సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్‌రావు, కోశాధికారి శ్రీరాం రవీందర్, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











