ఖమ్మం, 2026-08-31
మధిర డిపో ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆగస్టు 30, 2026న హైదరాబాద్ వెళ్తున్న బస్సులో మర్చిపోయిన సుమారు రూ. 25,000/- విలువైన మొబైల్ ఫోన్‌ను కండక్టర్, డ్రైవర్ గుర్తించి, యజమాని ఇనపనూరి మధుకు తిరిగి అప్పగించారు.
మధిర డిపో ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆగస్టు 30, 2026న మధిర డిపోకు చెందిన 041394 నంబర్ గల ఎక్స్‌ప్రెస్ బస్సు మధిర నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇనపనూరి మధు (శ్రీను కుమారుడు) అనే ప్రయాణికుడు ఖమ్మం నుండి ఎల్బీనగర్కు ప్రయాణిస్తూ, తాను కూర్చున్న సీటులో తన మొబైల్ ఫోన్‌ను మర్చిపోయి ఎల్బీనగర్ వద్ద దిగి వెళ్లిపోయారు.
బస్సు బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత, బస్సులో మొబైల్ ఫోన్ పడి ఉండటాన్ని గమనించిన కండక్టర్ .నాగుల్ మీరా (.827064) మరియు డ్రైవర్ శ్రీకాంత్, మొబైల్లోని కాంటాక్ట్స్ ద్వారా సదరు ప్రయాణికుడికి సమాచారం అందించారు. హైదరాబాద్ బస్ స్టేషన్ మేనేజర్ () సమక్షంలో, సుమారు రూ. 25,000/- విలువైన మొబైల్ ఫోన్‌ను సదరు ప్రయాణికుడికి అప్పగించారు.
తమ మొబైల్ ఫోన్‌ను తిరిగి అప్పగించినందుకు కండక్టర్, డ్రైవర్‌తో పాటు మధిర డిపో మేనేజర్ . దేవరాజు గారికి, మధిర డిపో సిబ్బందికి సదరు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు.










