మధిర, 2026-06-05
మధిర పట్టణంలోని ట్యాంక్ బండ్‌పై ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పట్టి, పాడైపోవడంతో వాటి మరమ్మతులకు, కొత్త ఆధునిక వ్యాయామ పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వందలాది మంది ప్రతిరోజూ వినియోగించే ఈ జిమ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని వాకర్స్ సంఘం తెలిపింది.
మధిర పట్టణంలోని ట్యాంక్ బండ్‌పై ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రతిరోజూ వందలాది మంది వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వయసుల వారికి ఈ ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే, ప్రస్తుతం ఓపెన్ జిమ్‌లోని కొన్ని పరికరాలు తుప్పు పట్టి పనికిరాకుండా పోగా, మరికొన్ని పాడయ్యే దశలో ఉన్నాయి. దీంతో ప్రజలు ఓపెన్ జిమ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.
ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పాడైపోయిన పరికరాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు, కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడమైనది. అదేవిధంగా, ట్యాంక్ బండ్‌కు ప్రతిరోజూ వచ్చే ప్రజల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, మరిన్ని ఆధునిక వ్యాయామ పరికరాలను అదనంగా ఏర్పాటు చేసి, ఓపెన్ జిమ్‌ను మరింత అభివృద్ధి చేయాలని కోరడమైనది.
వివిధ వయసుల వారికి ఉపయోగపడే వ్యాయామ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పట్టణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, పరికరాలకు ఎప్పటికప్పుడు నిర్వహణ, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
కావున, మధిర ట్యాంక్ బండ్‌పై ఉన్న ఓపెన్ జిమ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి, తుప్పు పట్టి పనికిరాకుండా పోయిన పరికరాలను బాగు చేయడంతో పాటు, అదనంగా ఆధునిక వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని మధిర ట్యాంక్ బండ్ వాకర్స్ సంఘం కోరుతోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మధిర మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ మరియు మధిర పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఈ వినతి సమర్పించబడింది.









