Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం ఉపాధ్యక్షులుగా వెంపటి శబరినాథ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఈ నియామక పత్రాన్ని అందజేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన శబరినాథ్, ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వ సేకరణలో విశేష కృషి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం ఉపాధ్యక్షులుగా వెంపటి శబరినాథ్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అందజేశారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన వెంపటి శబరినాథ్ 2018 సంవత్సరం నుంచి వాసవి క్లబ్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఇటీవల జరిగిన ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఎన్నికల్లో కూడా తన వంతుగా సేవలు అందించారు.
ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వ సేకరణలో ముందుండి, అత్యధికంగా సభ్యత్వాలు సేకరించి రాష్ట్ర మహాసభ దృష్టిని ఆకర్షించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో స్థానం కల్పించినందుకు పలువురు ఆర్యవైశ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.











