ఒక కేసును మూసివేయడానికి మరియు పోలీసు చర్యల నుండి మినహాయింపు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ), ఒక హోమ్‌గార్డ్‌తో కలిసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్. కొండల్ రావు (-1), అదే స్టేషన్‌కు చెందిన హోమ్‌గార్డ్ శ్రీ అబిద్ అలీ (-2)తో కలిసి ఒక ఫిర్యాదుదారుని తండ్రిపై ఉన్న కేసును క్లోజ్ చేయడానికి, కఠిన చర్యలు తీసుకోకుండా భవిష్యత్తులో సహకరించడానికి రూ. 6,00,000/- లంచం డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో, మొదటి విడతగా రూ. 3,00,000/- లంచం మొత్తాన్ని ఫిర్యాదుదారు నుండి హోమ్‌గార్డ్ అబిద్ అలీ ద్వారా తీసుకుంటుండగా, ఏసీబీ సిటీ రేంజ్-1 యూనిట్ అధికారులు 2027న దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 3,00,000/- ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్, రిమాండ్
అధికారిక విధుల నిర్వహణలో దురుద్దేశంతో, అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు గానూ సీఐ కొండల్ రావు, హోమ్‌గార్డ్ అబిద్ అలీలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లిలోని ఎస్పిఈ ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ విజ్ఞప్తి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, వాట్సాప్ నంబర్ 9440446106కు గానీ సమాచారం అందించాలని అధికారులు కోరారు. అలాగే అధికారిక సోషల్ మీడియా ఖాతాల (, /: ) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.












