జగిత్యాల, 6 September
జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్2026 విభాగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును పాఠశాల యాజమాన్యం ఆదివారం అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఈ అవార్డును స్వీకరించారు.
జాతీయ స్థాయిలో ప్రగతి హై స్కూల్ సత్తా -బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్–2026 అవార్డు కైవసం రాయికల్: జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. నేషనల్ స్కూల్ అవార్డ్స్–2026లో “బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్–2026” విభాగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును పాఠశాల యాజమాన్యం ఆదివారం అందుకుంది. న్యూఢిల్లీ ద్వారకలోని ఐటీసీ హోటల్ లో ఆదివారం నిర్వహించిన నేషనల్ స్కూల్ అవార్డ్స్–2026 పురస్కార ప్రదానోత్సవంలో ఈ అవార్డును ప్రగతి హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, యాజమాన్య ప్రతినిధులు గోపాల్ రెడ్డి,మల్లేష్ స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విభాగంలో ప్రగతి హై స్కూల్ ఎంపికై జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ, క్రమశిక్షణ, ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలకు ఈ జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ పేర్కొన్నారు. ఈ అవార్డు పాఠశాల భవిష్యత్ ప్రగతికి మరింత స్ఫూర్తినిస్తుందని తెలిపారు. రాయికల్ ప్రగతి విద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల విద్యాభిమానులు, పూర్వ విద్యార్థులు, స్థానికులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రి చిరాగ్ పాస్వాన్,ఎన్ఎస్ఏ ఫౌండర్ శిఖా, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ పార్లమెంటు లోక్ సభ డాక్టర్ ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ లోక్ సభ సెక్రటేరియట్ నిఖిల్ మిగ్లాని,డా. గౌరవ్ కపూర్, సుమిత్ వర్మ,సోమా సింగ్,అభిషేక్ కె. యాదవ్, నీనా భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.










