వరంగల్, 3 September
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన శాగంటి స్వామికి, ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. 25 సంవత్సరాలుగా విద్యారంగంలో ఆయన అందించిన విశేష సేవలందించినందుకు ఈ పురస్కారం లభించింది.
*పత్తిపాక శాగంటి స్వామికి లయన్స్ క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు* శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన శాగంటి స్వామి 25 సంవత్సరాలుగా పాఠశాల విద్యా రంగంలో విద్యార్థులకు ఉత్తమ విద్యా సేవలు అందించినందుకు గాను ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మేచరాజుపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ విభాగంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న శాగంటి స్వామి పాఠశాలకు ఎన్నో రకాల ఉన్నతమైన సేవలను అందించారు. గ్రామంలో మరియు జిల్లాలో గల దాతల ద్వారా పాఠశాలకు, విద్యార్థులకు అనేక వసతులను కల్పించి విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి కారకులయ్యారు. తమ వద్ద చదువుకున్న పేద విద్యార్థులను ఆర్థికంగా, హార్దికంగా ప్రోత్సహించి, ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన శాగంటి స్వామి జనగామలో ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ వారిచే అవార్డు అందుకుంటారు. ఈ సందర్భంగా పత్తిపాక గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు శాగంటి స్వామిని అభినందించారు*












