హైదరాబాద్, 2026-06-05
ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా హాజరుకాని టీచర్లు, సిబ్బందిపై విద్యాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరైన వారిని నేరుగా ఉద్యోగాల నుంచి తొలగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా హాజరుకాని టీచర్లు, సిబ్బందిపై విద్యాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరైన వారిని నేరుగా ఉద్యోగాల నుంచి తొలగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు విదేశాల్లో ఉండి తిరిగి రాని వారికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
5 ఏళ్లు దాటితే ఆటోమేటిక్ రాజీనామా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగికైనా ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, ఒకవేళ టీచర్ లేదా ఇతర సిబ్బంది ఏడాదికి మించి అనుమతి లేకుండా గైర్హాజరైనా, లేదా ఐదేళ్లు పూర్తిగా అబ్సెంట్ అయినా వారు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లే పరిగణించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
బోధనకు ఆటంకంపై చర్యలు
టీచర్లు అనుమతి లేకుండా డ్యూటీకి రాకపోవడం వల్ల పాఠశాలల్లో బోధనకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని విద్యాశాఖ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గైర్హాజరైన వారిపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లు (ఆర్డీఈలు), జిల్లా విద్యాధికారులకు (డీఈఓలకు) ఆదేశాలు వెళ్లాయి. అబ్సెంట్ను గుర్తించగానే షోకాజ్ నోటీసు ఇచ్చి, సీసీఎ రూల్స్ ప్రకారం విచారణ ప్రారంభించాలని సూచించారు.
అధికారులపైనా బాధ్యత
చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసే హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలను కూడా బాధ్యులను చేస్తామని డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. ప్రతి డీఈఓ కార్యాలయంలో అబ్సెంట్ టీచర్ల రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలని ఆదేశించారు. గైర్హాజరు కాలాన్ని డీస్ నన్‌గా పరిగణించి, ఇంక్రిమెంట్, పెన్షన్లలో కోత విధించనున్నట్లు తెలిపారు.












