హనుమకొండ, 2026-08-11
పౌరులుగా మన రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా పై నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (), ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆమె, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రారంభించారు.
పౌరులుగా మన రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ () వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (), ఫోటో ఎగ్జిబిషన్‌ను పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సీబీసీ రూపొందించిన జాతీయ పతాకం యొక్క ప్రస్థానం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లోని అంశాలను వివరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ ప్రసంగించారు.
యువత క్రియాశీల భాగస్వామ్యం అవసరం
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. మన రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పౌరులుగా మన బాధ్యత ఏంటి అనేవి ఇలాంటి కార్యక్రమాలు మనకి గుర్తు చేస్తాయని అన్నారు. కేవలం హక్కుల కోసం పోరాడటం అనేది ఒక నాణేనికి ఒక వైపు మాత్రమేనని, మరోవైపు మన బాధ్యత ఏముందనేది తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మనకు దక్కిన స్వాతంత్ర్యానికి గౌరవం, విలువ ఇస్తూ, భవిష్యత్ తరాలకు ఎటువంటి సమాజాన్ని అందిస్తామో అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని, దేశాభివృద్ధి, భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని అన్నారు. మీ జీవితాలను మీరు ఎలా మలుచుకుంటారు అనేది వందకి వంద శాతం మీ చేతుల్లోనే ఉంటుందని, కష్టపడి మన జీవితాన్ని మనమే మెరుగుపరచుకోవాలని యువతకు సూచించారు.
కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రసంగం
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం కోసం జరిగిన త్యాగాలు, పోరాటాల జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, స్వతంత్ర భారతదేశంలో జన్మించడం మన అదృష్టమని అన్నారు. ఇంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను వారసత్వంగా పొందడం మనకు లభించిన గొప్ప అవకాశమని, మన రాజ్యాంగాన్ని పొందడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు మనకు ఉన్నాయని తెలిపారు.












