జగిత్యాల, 5 October
జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బృందం సోమవారం పలు రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీలలో , , రెస్టారెంట్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, తీవ్రమైన పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో, నిబంధనల మేరకు ఆయా రెస్టారెంట్లపై చర్యలు తీసుకుని, మొత్తం రూ.25,000 వరకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం నిర్వాహకుల బాధ్యత అని పేర్కొన్నారు.
ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయడంతో పాటు, కుళ్లిపోయిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగించరాదని హెచ్చరించారు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే హోటళ్లు, రెస్టారెంట్లపై మున్సిపల్ శాఖ తరఫున ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.