ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారు కానీ, కనీసం బతకడానికి అవసరమైన ట్రై సైకిల్ కూడా ఇవ్వడం లేదని మెట్‌పల్లికి చెందిన దివ్యాంగ మహిళ రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యను పరిష్కరించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
పుట్టుకతోనే దివ్యాంగురాలైన రాజమ్మ ఒంటరిగా జీవిస్తూ, కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నానని కన్నీటి పర్యంతమైంది. తన సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని తెలిపింది.
కలెక్టర్‌కు రాజమ్మ వినతి
తనకు ట్రై సైకిల్‌తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం రోజున ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం నా అవసరం ఉంటుంది.. కానీ నేను బతకడానికి పడుతున్న కష్టం ఎందుకు కనిపించదు అంటూ ఆమె చేసిన వేడుకోలు అక్కడివారిని కదిలించింది.
తన పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణ సాయం అందించాలని రాజమ్మ కోరింది.











