జగిత్యాల, 2026-06-05
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిష్టంపేట మాజీ సర్పంచ్ తంగెళ్ల రమేష్ గారి తండ్రి స్మారకార్థం అల్లీపూర్ పరిసర గ్రామాల సౌకర్యం కోసం బాడీ ఫ్రీజర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.

ఎమ్మెల్యే ప్రసంగం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచంలోనే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అత్యంత ప్రాచీన సంస్థలని, సామాజిక సేవ ద్వారానే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రభుత్వాలే ప్రజలకు అన్నీ చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. అత్యంత ధనిక దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయని, భారతదేశం పేద దేశమని, ఇక్కడ స్వచ్ఛంద సంస్థల పాత్ర అత్యంత ఆవశ్యకమని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు కేటాయించాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, సర్పంచ్ గౌతమి వెంకటేష్, పాక్స్ చైర్మెన్ రాజలింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యం ఏ ముఖీధ్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేందర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ సాగర్ రావు, గ్రామ మండల నాయకులు, సర్పంచులు, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.