Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 08
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అంతర్గాం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు చీటి భూపతిరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులు పూల బొకేలు, శాలువాలతో ఉపాధ్యాయులను సత్కరించారు.
అంతర్గాం ఉన్నత పాఠశాలలో ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం----- ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్గాం ఉన్నత పాఠశాలలో ఈరోజు పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు చీటి భూపతిరావు గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పూల బోకే శాలువాలతో సన్మానం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు భూపతి రావు గారు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో నిలబడ్డరోజే మాకు ఉపాధ్యాయులుగా గర్వంగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. గత సంవత్సరం 100% రావడం బాసర త్రిబుల్ ఐటీ లో రెండు సీట్లు రావడం జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల లో ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకు గొప్ప విషయమని!ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ తో కోమంది త్రిబుల్ ఐటీ లో సీట్లు సంపాదించాలని విద్యార్థులకు సూచించారు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు బాలే సరోజ ఎర్రోజు అనిత, రజనీకర్ రెడ్డి, రాజేందర్, ఫిజికల్ డైరెక్టర్ కోటేశ్వరరావు, ఫక్రుద్దీన్, శరత్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ రాజు, లలిత పాల్గొన్నారు












