కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర పిసిసి కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షకు మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర పిసిసి కమిటీ పిలుపునిచ్చింది. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రంలో చేపట్టే నిరసన దీక్షకు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ ను తొలగించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడుతున్న బీజేపీకి సహకరిస్తున్న జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొక్క బిక్షపతి, సర్పంచుల పోరం మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, సర్పంచులు దున్నా శ్రీనివాస్, వేల్పుల సోమయ్య, కంభంపాటి సరిత చైతన్య, కేశగాని సరిత లక్ష్మణ్, ఉప సర్పంచ్ లు ఎలుగూరి నాగరాజు, నలమాద వీరబాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, బాణాల నాగరాజు, బడేటి వెంకటేశ్వర్లు, రేపాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

