తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో తప్పులుంటే ఇక ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ స్మార్ట్ఫోన్లోనే - యాప్ ద్వారా ఈ వివరాలను సులభంగా సరిచేసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. అయితే, కొందరి కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వివరాలను మొబైల్ ద్వారా సులభంగా సరిచేసుకోవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులను సరిచేసుకోవడానికి, లబ్ధిదారులు తమ ఫోన్లలో - యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా కార్డులోని వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం కల్పించారు.
యాప్లో స్మార్ట్ కార్డును స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియ కనిపిస్తుంది. అక్కడ తప్పుగా ఉన్న సమాచారాన్ని సరిచూసుకుని, ఎడిట్ ఆప్షన్ ద్వారా వివరాలను సవరించి, సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డును రూపంలో ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల లబ్ధిదారులు తమ వద్ద ఎల్లప్పుడూ కార్డు వివరాలను అందుబాటులో ఉంచుకోవచ్చు.

