సూర్యాపేట జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు కేసగాని భద్రయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం అందించకపోవడం పట్ల సిపిఎం మండల కమిటీ సభ్యులు కేసగాని భద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన వరి పంటకు అవసరమైన సమయంలో నీరు, విద్యుత్ అండగా నిలవాల్సిన సమయంలోనే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. పంట చేతికందే సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కరెంటు కోసం రైతులు పొలాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రోజుకు కేవలం 6 గంటల వరకు మాత్రమే విద్యుత్ అందిస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అన్నారు. కరువు ప్రభావంతో ఉపాధి కోల్పోయే వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించి, పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో తాగునీరు, పశువులకు మేత, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.












