జగిత్యాల, 13 November
జగిత్యాల: మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రకళ, వక్తృత్వం, వ్యాసరచన, విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు కళలు, క్రీడలు, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయురాలు రజితా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ రావు, హరిచరణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.







