నడిగూడెం, 15 November
బాలల హక్కుల పరిరక్షణకు జీవితాంతం పాటుపడిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా దివంగత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలలు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, దానిని చేరుకోవడానికి ఇష్టంతో చదువుకోవాలని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
విద్యా, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి పలు అంశాలపై బాలలకు అవగాహన కల్పించారు. బాలల సభలో విద్యార్థులు తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి, పల్లె దవఖాన డాక్టర్ హరినాథ్, వార్డెన్ లతీమూన్, వార్డు సభ్యులు కాసాని మాధవి గోపీనాథ్, షేక్ నాజియా రియాజ్, అంగన్వాడి టీచర్లు సవిత, కొండలమ్మ, శకుంతల, స్వర్ణ కుమారి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, వివో లావణ్య, ఆశా కార్యకర్తలు సునీత, శ్రీ లక్మి, జూనియర్ అసిస్టెంట్ వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.






