కాజీపేట్, 2026-08-15
పశ్చిమ నియోజకవర్గం కాజీపేట మండలంలోని 47వ డివిజన్ డీజిల్ కాలనీ భవానీనగర్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 47వ డివిజన్ కాంగ్రెస్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పశ్చిమ నియోజకవర్గం కాజీపేట మండలంలోని 47వ డివిజన్ డీజిల్ కాలనీ భవానీనగర్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 47వ డివిజన్ కాంగ్రెస్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల విద్యాసాగర్, కాసర్ల నాగేష్, అశోక్, సత్యవరం మధుకర్, సురేందర్, చిన్న, ఇమ్మడి నాగరాజు పాల్గొన్నారు. అలాగే భవానీనగర్ కాలనీ పెద్దలు మాచర్ల శేఖర్, ఎల్లయ్య, వెంకటస్వామి, మేఘరాజు, కుమారస్వామి, బండి సదానందం, చార్జి, నాగరాజు, పాస్టర్ యోహానుతో పాటు యువజన సభ్యులు అబ్బో, సుమన్, వినోద్, విక్కీ, బన్నీ, ప్రశాంత్, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
నాయకుల పిలుపు
ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధి, ఐక్యత, దేశభక్తి భావాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలు, యువజన సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












