ముస్తాబాద్, 8 September
భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యాలయం నందు కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యాలయం నందు కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. 🟠ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణపదమని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు & అంశాలు: 🔶కేంద్ర పథకాల ప్రచారం: వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా మోదీ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం. 🔶స్థానిక సమస్యలపై పోరాటం: స్థానిక ప్రజాసమస్యల పరిష్కారానికి బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించడం, పోరాటాలు చేయడం. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ,మండల ఉపాధ్యక్షులు చికోటి మహేష్,చిట్టినేని శ్రీనివాస్ రావు,మెంగని మహేందర్,వరి వెంకటేష్,చిగురు వెంకన్న,మీస స్వామి,దీటి సత్తయ్య, ఒరగంటి సత్యం,మర్గల వేణు, మీస కర్ణాకర్,మల్లేశం, యాదగిరి,నర్సింలు, తిరుపతి, వినయ్,బూత్ కమిటీ అధ్యక్షులు మరియు బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












