Andaman and Nicobar Islands, 10 September
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
జగిత్యాల: *భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి చోసం తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం...* *జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య..* తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ చూపించిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణం, బహుజన పోరాట పటిమకు ప్రతీక అని, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చింతకుంట చెరువు వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు., అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆమె ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సేవాదళ్ సెక్రటరీ బోగోజీ. ముకేశ్ ఖన్నా, కాంగ్రెస్ SC జిల్లా అధ్యక్షులు.దుమాల రాజ్ కుమార్,కౌన్సిలర్ గిరిధర్, పెద్ధింటి రాజు, మల్లేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు






