గుమ్మడిదల, 11 October
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిత్వం కోసం పలువురు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది.

కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన బండారు కవితా రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కోసం పరిశీలనలో ఉన్న ఆశావాహుల్లో ఆమె ఒకరిగా ప్రస్తావనకు వస్తున్నారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలు, ఉద్యోగుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన అంశాలు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.