మంగళవారం (ధర్మ రథం) సెప్టెంబర్ 08
రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించరాదని బీఆర్ఎస్ మండల నాయకులు దాసి శ్రావణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి, ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ను గద్దె దించేదాకా విశ్రమించొద్దు శాయంపేట రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన దగా కోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని బీఆర్ఎస్ మండల నాయకులు దాసి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ హయాంలో ఎంతో సుభిక్షంగా ఉన్న ప్రజలు నేడు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, కౌలు రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో పథకాలను అమలు చేయకుండా నీరుగార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల వెంకటేశ్వర్లు, మారపెల్లి నందం, రంగు మహేందర్, కొమ్ముల శివ, నరేందర్, చెన్నబోయిన అజయ్, విద్యాసాగర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












