ఇప్పుడు (ధర్మ రథం) అక్టోబర్ 13
తెలంగాణ పోలీస్ అకాడమీలో 112 మంది డీఎస్పీ ఆఫీసర్ ట్రైనీస్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన తొలి బ్యాచ్‌గా, శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్‌గా ఈ బ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకుంది.
తెలంగాణ పోలీస్ అకాడమీలో 112 మంది డీఎస్పీ ఆఫీసర్ ట్రైనీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన తొలి బ్యాచ్‌గా, శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్‌గా ఈ బ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకుంది. 44 వారాల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, జిల్లాల్లో క్షేత్రస్థాయి శిక్షణకు సిద్ధమయ్యారు.
తెలంగాణ జనాభాలో కేవలం 0.3 శాతం మందికి మాత్రమే లభించే పోలీస్ యూనిఫాం ధరించే గౌరవాన్ని బాధ్యతగా భావించి, నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవ అనే విలువలను తమ విధుల్లో మార్గదర్శకంగా పాటించాలని డీజీపీ సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ రద్దీ, ఆహార కల్తీ, వ్యవస్థీకృత నేర ముఠాల వంటి నూతన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వీటిని అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు.
వృత్తి జీవితమంతా శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ రోజు బెల్టును ఏ రంధ్రానికి పెట్టుకుంటున్నారో, పదవీ విరమణ చేసే రోజు కూడా అదే రంధ్రానికి పెట్టుకునేంత ఫిట్నెస్ను కొనసాగించాలని డీజీపీ ఆకాంక్షించారు. ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేసి, అందరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.











