తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెనడిగూడెం ్షనర్లకు దీపావళి కానుకగా పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మండల శాఖ అధ్యక్షులు ఎండి ఖలీల్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పెన్షనర్లు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సంఘం ఆకాంక్షించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో, మండల కేంద్రానడిగూడెం ికి చెందిన ఎన్ ఎస్ పి రిటైర్డ్ ఉద్యోగి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ సీనియర్ సభ్యులు షేక్ ఇబ్రహీం, మరియు బృందావనపురం గ్రామస్తులు ఫ్యామిలీ పెన్షనర్ శ్రీమతి యర్రా అనసూర్యమ్మ గార్ల జన్మదినం సందర్భంగా వారి గృహాలను సందర్శించి, కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సన్మానించి, స్వీట్లు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మండల పెన్షనర్లు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సంఘం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ అధ్యక్షులు ఎండి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు దీపావళి కానుకగా పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ జాయింట్ సెక్రెటరీ గుండు అనంత రాములు, మండల శాఖ కార్యదర్శి రావూరి బాలాజీ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దున్న అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు నారాయణరెడ్డి, కవితా రెడ్డి, వసంత, బంధుమిత్రులు పాల్గొన్నారు.











