కథలాపూర్ (ధర్మ రథం) సెప్టెంబర్ 03
మండలం భూషణరావుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో యూనిఫామ్ వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎస్సై సిహెచ్ రవి కిరణ్ హాజరయ్యారు.
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో యూనిఫామ్ వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎస్సై సిహెచ్ రవి కిరణ్, గారు అంబేద్కర్ ఆశయ సాధన సమితి వారి ఆహ్వానం మేరకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల మానసిక స్థితిగతులు అలాగే ప్రవర్తన లో మార్పులు గాని సభ్య సమాజానికి వారిని మంచి సేవా బావా కులుగా తయారు చేసే దేవాలయాలే ఈ పాఠశాలలని ఈ పాఠశాలకు అలాగే విద్యార్థులకు ఉపయోగపడేలా అంబేద్కర్ ఆశయ సాధన సమితి వారు చేపట్టిన ఇట్టి కార్యక్రమాన్ని బట్టి వారికి అభినందనలు తెలిపారు. అలాగే ఎంఈఓ శ్రీనివాస్ సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి, గార్లు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని అలాంటి బాలలకు మంచి విద్యను అందించాలని అందుకు టీచర్ల సహాయ సహకారాలు ఎంతో గొప్ప వని వారు ఈ సందర్భంగా తెలియజేశారు, వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ఈ యూనిఫామ్ వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన అంబేద్కర్ ఆశయ సాధన సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు తలారి మోహన్ మరియు ప్రత్యేక సలహాదారుడు కూన అశోక్ గార్లు మాట్లాడుతూ తాము స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క సమితిని పరిచయం చేస్తూ పాఠశాలకు సంబంధించిన అలాగే గ్రామంలోని సేవా కార్యక్రమంలో తమ సమితి సాధ్యమైన ప్రతిసారి పాలు పొందుతుందని అయితే మొదటి నిర్ణయంగా ఈ యూనిఫాంల వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని అందుకు పలువురు దాతలు ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అలాగే వారు మాట్లాడుతూ సమితి అడిగిన వెంటనే మాట బలంతో పాటు తాను కూడా దాతగా ఇట్టి కార్యక్రమంలో పాల్ పొందినందుకుగాను మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించిన తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ ఈరోజు ఉదయం వరకు కూడా ప్రోగ్రాం ఎలా జరుగుతుందో అన్న భయం మాలో ఉండేది కానీ ఇంత విజయవంతంగా నిర్వహించడానికి వాతావరణం సహకరించడంతోపాటు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అలాగే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సై,ఎంఈఓ మరియు గ్రామ సర్పంచ్ లతోపాటు ఇందుకు ఆర్థికంగా సహకరించిన దాతలను మరియు జడ్పీహెచ్ఎస్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సభా వేదికగా సమితి ఆధ్వర్యంలో శాలువా సత్కారం చేశారు. తరువాత విచ్చేసిన గ్రామ యువతకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అనంతరం స్వీట్ పంపిణీ చేశారు, ఇందులో అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఉపాధ్యక్షుడు జిన్నా ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కరెంగుల ప్రణయ్,కోశాధికారి కూన నవీన్, కూన ప్రవీణ్, కూన చంద్రకాంత్, దాసు, బుర్రి శ్యాంసుందర్, బంటు సురేష్,లు పాల్గొన్నారు.












