ఎల్లారెడ్డిగూడెం పాఠశాలలో 2002 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయంగా జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మిత్రులంతా ఒకచోట చేరి బాల్య స్నేహాలను, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
చదువుకున్న రోజులు మధుర జ్ఞాపకాలు. కలిసి గడిపిన క్షణాలు మరపురాని అనుభూతులు. కాలం మారినా, వయసు పెరిగినా మన మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం ఎప్పటికీ మారదు. ఒకే బడిలో చదివి, ఒకే బెంచిపై కూర్చొని, ఎన్నో అల్లరి జ్ఞాపకాలను పంచుకున్న 2002 పదో తరగతి మిత్రులందరూ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరడం ఎంతో ఆనందకరం.
నాటి బాల్య స్నేహాలను గుర్తుచేసుకుంటూ, నవ్వులు పంచుకుంటూ, ఆత్మీయ పలకరింపులతో ఈ సమ్మేళనాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవడం అభినందనీయం.
ఈ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బాలకృష్ణ మాట్లాడుతూ, తన మిత్రులకు ఎప్పుడు ఏ సహాయమైనా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్రులందరికీ భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో దాసోజు కోటి, శాంతి కుమార్, యాదగిరి, సతీష్ మల్లేష్, లింగస్వామి, రామలింగయ్య, పరమేష్, దాసు, యాదగిరి, రాములు, లింగస్వామి, పోలగోని శేఖర్, మధు, నాగరాజు రవి, ఉపేందర్, లక్ష్మయ్య, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, సైదిరెడ్డి, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని ముగించారు.












