విజయవాడ లాకప్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపు యువకుడు గాదె సాయికృష్ణ కేసు విచారణను తామే చేపడతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

సాయికృష్ణ తల్లి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏపీ డీజీపీ నిద్రపోతున్నారా అని వ్యాఖ్యానించింది. సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైనా ఏసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
పోలీసుల తీరు ఘోరంగా ఉందని, వారి విధి వారికి తెలియదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికీ బాడీ లేకపోవడం, దర్యాప్తు తీరు ఆందోళనకరంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.