జగిత్యాల, 16 September
జగిత్యాల జిల్లా ధర్మారం-2 అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ పవిత్ర గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ పరమాల సుమలత, ఉప సర్పంచ్ దీకొండ ప్రేమ్ నాథ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, అంగన్వాడి టీచర్ గీత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మారం-2 అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ పవిత్ర గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ పరమాల సుమలత, మల్లేష్, ఉప సర్పంచ్ దీకొండ ప్రేమ్ నాథ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, అంగన్వాడి టీచర్ గీత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ, పోషకాహార అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో సులభంగా లభించే ఆకుకూరలు, పాలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు వంటి పోషక పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ మాసోత్సవాల ద్వారా ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.










