బెంగళూరు (ధర్మ రథం) సెప్టెంబర్ 23
ప్రాణాలను కాపాడాల్సిన ఔషధాలను కల్తీ చేయడం అమాయక రోగుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఇటీవల కర్ణాటకలో వెలుగుచూసిన నకిలీ క్యాన్సర్ మందుల దందా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దక్షిణ జిల్లా బిడదీలోని లైసెన్స్ లేని ఫామ్‌హౌస్‌లో నకిలీ, గడువు ముగిసిన క్యాన్సర్ మందులను తయారు చేస్తున్న గుట్టును అధికారులు రట్టు చేశారు.
ప్రాణాలను కాపాడాల్సిన ఔషధాలను కల్తీ చేయడం అమాయక రోగుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఇటీవల కర్ణాటకలో వెలుగుచూసిన నకిలీ క్యాన్సర్ మందుల దందా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దక్షిణ జిల్లా బిడదీలోని లైసెన్స్ లేని ఫామ్‌హౌస్‌లో నకిలీ, గడువు ముగిసిన క్యాన్సర్ మందులను తయారు చేస్తున్న గుట్టును అధికారులు రట్టు చేశారు. సుమారు రూ. 5 కోట్ల విలువైన నకిలీ మందులు, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు మందులను సేకరించి, ఫైజర్ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో లేబుల్ మార్చి తో పాటు 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్‌లకు సరఫరా చేశారు. 2025 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 12 కోట్ల విలువైన మందులను విక్రయించినట్లు సిట్ అంచనా వేసింది. లైసెన్స్ లేని కేంద్రాల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, నకిలీ క్యూఆర్ కోడ్లు పనిచేయకపోయినా నిఘా వర్గాలు గుర్తించకపోవడం ఔషధ నియంత్రణ వ్యవస్థ ఘోర వైఫల్యానికి నిదర్శనం.
అజర్ బైజాన్ నుంచి ఈ రాకెట్ నడుపుతున్న ప్రధాన నిందితుడిని రప్పించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఔషధ నాణ్యతను పర్యవేక్షించే పటిష్టమైన వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అమృతంలాంటి మందులను ప్రాణాంతక విషంగా మారుస్తున్న ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.











