అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి, పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చల్గల్కు చెందిన మానాల మారుతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
నరసింగపూర్ రోడ్డుకు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానాల మారుతి అనే యాప్ ద్వారా పెట్టుబడులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిరోజూ 1 శాతం లాభం, 100 రోజుల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని, ఆ తర్వాత రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మబలికాడు. ఇంకా, ఇతరులను రిఫరల్ ద్వారా ఈ యాప్‌లో చేర్పిస్తే అదనపు లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. ఈ విధంగా ఫిర్యాదుదారుతో పాటు పలువురి నుంచి మొత్తం సుమారు రూ.5 కోట్ల పెట్టుబడులను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా, చల్గల్లోని మారుతి ఇంటి వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను మోసానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి పేరుతో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మానాల మారుతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.











