Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 11
తమిళనాడుకు చెందిన అడ్వకేట్ స్నేహ, 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కులం లేదు, మతం లేదు అని పేర్కొన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని పొందారు. భారత్లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే తొలిసారి.
భారత్లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ! తమిళనాడుకు చెందిన అడ్వకేట్ స్నేహ దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత “కులం లేదు, మతం లేదు” అని పేర్కొన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు సమాచారం. కుల, మతాలకు అతీతంగా సమానత్వం, మానవత్వం, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సామాజిక గోడలను దాటి సమానత్వం వైపు మరో అడుగు!












