రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నరేష్ హాస్పిటల్లో వైద్యం వికటించి కంకణాల ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన కంకణాల ఆంజనేయులు అనారోగ్యంతో బాధపడుతూ పట్టణంలోని నరేష్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అందించిన చికిత్స వికటించడంతో ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆంజనేయులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
న్యాయం చేయాలని డిమాండ్
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.











