Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 14
ఖమ్మం జిల్లా మధిర టౌన్ లో డీజే సౌండ్స్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా ప్రాణహాని ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 85 డెసిబెల్స్ మించిన శబ్దాలు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు తెలిపారు.
*14/09/2026.ఖమ్మం మధిర టౌన్.డీజే సౌండ్స్ వల్ల చాలా ప్రమాదాలున్నాయి.ముఖ్యంగా ప్రాణ హాని ఉంది. 85 డెసిబుల్స్క మించిన శబ్దాలను విన్నప్పుడు అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయి, హార్ట్ రేటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. ఒక్కోసారి కార్డియాక్ అరెస్టు అవుతుంది. స్ట్రెస్ కార్డియోమయోపతికి గురై.. గుండె ఆకస్మాత్తుగా వీక్ అవుతుంది. బ్రోకెన్ హార్డ్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. డీజే సౌండ్స్ వల్ల దీర్ఘకా లంలో బీపీ పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి అధికమవుతుంది. అందువల్ల డీజే సౌండ్ బాక్స్లలను అనుమతిoచరాదు. పేస్మే కర్స్ వాడుతున్న వారు, బీపీ, యాంగ్ జైటీ సమస్యలు ఉన్నవారు డీజే సౌండ్స్‌కు దూరంగా ఉండడం మేలు.*










