వెల్దండ, 13 September
పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలం ఆజిలాపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బాధగోని లింగం, కాలే శ్రీశైలం కుటుంబాలకు ఈ సహాయం అందింది.
అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గం మండలం ఆజిలాపూర్ గ్రామానికి చెందిన బాధగోని లింగం, సన్నాఫ్ బక్కయ్య, కాలే శ్రీశైలం, సన్నాఫ్ బీరయ్యలకు ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌ను అందించారు. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఈ సిమెంట్‌ను లబ్ధిదారులకు అందజేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను అందించడం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఉప్పల వెంకటేష్‌కు గ్రామస్తులు, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్, వార్డు సభ్యులు కాలే తిరుపతయ్య, కాళి మహేష్, లింగమయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.












