కోరుట్ల, జూలై 25
కోరుట్ల పట్టణంలో కల్లూరు రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలోని టౌన్-5 ఫీడర్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నందున, ఆదివారం (26.07.2026) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేయబడుతుంది.
కోరుట్ల పట్టణ విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక. కల్లూరు రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలోని టౌన్-5 ఫీడర్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు ఏఈ (టౌన్-1) తెలిపారు.
ఈ పనుల నిమిత్తం రేపు అనగా తేదీ 26.07.2026 (ఆదివారం) రోజున ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 04.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
మాదాపూర్ కాలనీ, డి 40 ఏరియా, సాయిబాబా గుడి ప్రాంతం, వెంకట్ సాయినగర్, సంగెం రోడ్డు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, తదనుగుణంగా తమ పనులను సర్దుబాటు చేసుకొని విద్యుత్ శాఖకు సహకరించాల్సిందిగా అధికారులు కోరారు.





