కోదాడ రూరల్ సిఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డి రామకృష్ణారెడ్డిని, శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో, పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు సేకు శ్రీనివాసరావు, ఫౌండేషన్ సభ్యుడు గోపి రాథోడ్.
ఈ కార్యక్రమంలో సుధాకర్, పలువురు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ, కోదాడ రూరల్ పరిధిలో అనేక గ్రామాలు ఉన్నాయని, శాంతి భద్రతల పరిరక్షణకు, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు.











