తెలంగాణ, 4 October
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దీపావళి కానుకగా రూ.1,10,250 పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) బోనస్ అందనుంది. కోల్కతాలో జరిగిన జేబీసీసీఐ అపెక్స్ జేసీసీ సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దీపావళి కానుకగా రూ.1,10,250 పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. కోల్కతాలో శనివారం జరిగిన జేబీసీసీఐ అపెక్స్ జేసీసీ సమావేశంలో 202526 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎల్ఆర్పై చర్చించి, ఈ మొత్తాన్ని చెల్లించేందుకు యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. గతేడాది కంటే ఈసారి బోనస్ రూ. 7,250 పెరిగింది. దీనిపై సింగరేణి యాజమాన్యం అధికారిక ఉత్తర్వులు, చెల్లింపు తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ బోనస్ తో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












