Khammam/Madhira (ధర్మ రథం) అక్టోబర్ 02
తెలంగాణలో ఆటో ప్రయాణికులకు షాక్ తగిలింది. ప్రభుత్వం ఆటో చార్జీలను గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీస చార్జీతో పాటు కిలోమీటరు చార్జీని కూడా పెంచారు. ఈ కొత్త చార్జీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
తెలంగాణలో ఆటో చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఆటోల కనీస చార్జీ 20 నుంచి 30కి, ప్రతి కిలోమీటర్‌కు 11 నుంచి 14కి పెంచారు. డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు, లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెరిగింది. గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో 1.5 రెట్లు చార్జీ విధానం కొనసాగుతుంది. మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు విధించారు.












