ముస్తాబాద్, 24 September
రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 190 మంది విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల 75వ వసంతం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 80,000 రూపాయల విలువైన దుస్తులను విద్యార్థులకు అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మామిండ్ల భూపతి గారి అధ్యక్షతన, విద్యార్థిని విద్యార్థులకు హౌస్ సిస్టమ్ ప్రకారం 4 హౌస్‌లకు దాదాపు 80,000 రూపాయల విలువైన 190 డ్రెస్సులను పూర్వ విద్యార్థుల సౌజన్యంతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ, అంబటి రవీందర్, ఉప సర్పంచ్ కోల కృష్ణ, వార్డు మెంబెర్ జంగ రాజు, పెద్దిగారి శ్రీనివాస్, యూత్ లీడర్ వరి వెంకటేష్ మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, తమ గ్రామంలోని పాఠశాలలో విద్యనభ్యసించి వివిధ హోదాలలో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు, పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాఠశాల మౌలిక వసతుల కోసం కొంత ఆర్థిక సహాయం అందించారు. ఆ డబ్బులతో ఈరోజు బాలికల మరియు బాలుర పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు హౌస్ డ్రెస్సులు (రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో రంగులవి) ఉచితంగా ఇవ్వడం జరిగింది.
అలాగే, బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సంకల్ప సిద్ది చారిటీ వారు, బాలికల పాఠశాల విద్యార్థినిలకు చైర్మన్ వరి జ్యోతి-వెంకటేష్ పుస్తకాలను ఉచితంగా అందించారు.












