రాయికల్, 28 September
మండలం రామాజీపేట గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని కనికారపు అంజలి చదువుకు దుబాయ్‌లోని ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు పి. చర్ల కిరణ్ కుమార్, సంఘ సభ్యులు స్పందించి ఆర్థిక సహాయం అందించారు. సోమవారం అంజలి గ్రామానికి తరలివచ్చిన వారు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మండలం రామాజీపేట గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని కనికారపు అంజలి చదువుకు దుబాయ్‌లోని ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు పి. చర్ల కిరణ్ కుమార్, సంఘ సభ్యులు స్పందించి సోమవారం అంజలి గ్రామానికి తరలివచ్చి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈటీసీఏ సంస్థ వైద్య విద్యార్థుల చదువులకు చేయూతనివ్వడంలో ముందుంటుంది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అంజలి భవిష్యత్తు ఖర్చులను కూడా మేమే భరిస్తాం అని తెలిపారు. విద్యార్థుల ఉన్నతికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఈటీసీఏ సభ్యులను, కిరణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి అంజలికి అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వాసరీ రవి, వెంకటేశ్వర్లు, బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.












