టీబీ ముక్త భారత్ లక్ష్యంగా ఫరూక్నగర్ హైస్కూల్లో ఎన్సీసీ విద్యార్థులకు క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు పాల్గొని వ్యాధి నివారణ, చికిత్సపై అవగాహన కల్పించారు.
టీబీ ముక్త భారత్ లక్ష్యంగా ఫరూక్నగర్ హైస్కూల్లో ఎన్సీసీ విద్యార్థులకు క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు టీబీ వ్యాధి, నివారణ, చికిత్సపై అవగాహన కల్పించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. టీబీ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి అని తెలిపారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఎన్సీసీ విద్యార్థులు టీబీపై అవగాహన ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలని, అనుమానితులను సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని తెలిపారు. టీబీ రోగుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తిగా కొనసాగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
టీబీని దాచకండిపరీక్ష చేయించుకోండి.. చికిత్సను మధ్యలో ఆపకండిపూర్తిగా తీసుకోండి.. టీబీ రోగిని దూరం చేయకండిచేయూతనివ్వండి.. మనమంతా కలిసి నిర్మిద్దాంటీబీ ముక్త భారత్ అనే సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు.
డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. టీబీకి ప్రస్తుతం సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని, వైద్యుల సూచనల మేరకు మందులను నిర్ణీత మోతాదులో, నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలని, పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ రవికుమార్, స్కూల్ ఎన్సీసీ మాస్టర్ విష్ణువర్ధన్, పీపీ యూనిట్ ఆశా కార్యకర్తలు, ఫరూక్నగర్ హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.












