జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యా దినోత్సవాన్ని ( ) ఘనంగా నిర్వహించారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటపాటలతో విద్యను అందించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
లక్ష్మీపూర్ గ్రామంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా ( ) ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యా దినోత్సవంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.డబ్ల్యూ.ఓ. భాస్కర్ మాట్లాడుతూ, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత కీలకమని తెలిపారు. వారిలో శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ, భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
పిల్లలకు ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం వంటి ఆటల ఆధారిత అభ్యాసం ద్వారా విద్యను అందించాలని, వారికి పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాలలో చేరే ముందు పిల్లలను పాఠశాల విద్యకు సంసిద్ధులను చేయడం, తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, సమాజం కలిసి పిల్లల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ, పోషకాహారం ఆరోగ్యకరమైన కుటుంబానికి పునాది అని అన్నారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన బిడ్డ, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో పోషకాహారం పాత్ర ఎంతో కీలకమని ఆమె తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, డి.డబ్ల్యూ.ఓ. భాస్కర్, సి.డి.పి.ఓ. జయప్రద, ఎ.సి.డి.పి.ఓ. రాజశ్రీ, పర్యవేక్షకులు పవిత్ర, లావణ్య, ఆరోగ్య వైద్య అధికారులు శ్రీదేవి, సౌమ్య, అంగన్ వాడీ టీచర్లు జయప్రద, పద్మజ, జలజ, రాజమణి, స్వప్న, జమున, సరిత, గీత, మమత, ఆశాలు, గ్రామ ప్రజలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.












