సూర్యాపేట జిల్లా మండలంలోని తెల్లబల్లి కాంప్లెక్స్ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెల్లబల్లిలో జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల కనీస సామర్థ్యాలను మెరుగుపరచడం, పరాక్ సర్వేకు సిద్ధం చేయడం వంటి అంశాలపై చర్చించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జి పద్మావతి అధ్యక్షత వహించారు.
సూర్యాపేట జిల్లా మండలంలోని తెల్లబల్లి కాంప్లెక్స్ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెల్లబల్లిలో జరిగింది. సమావేశానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జి పద్మావతి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలలను సందర్శించగా, ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్) ను టిఎల్ఎంతో సమర్థవంతంగా బోధిస్తున్నారని తెలిపారు.
పరాక్ సర్వేకు సిద్ధం చేయాలి
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి వనం సత్యనారాయణ గారు పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, పరాక్ అనే నేషనల్ లెవెల్ సర్వేకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం పిల్లల సమగ్ర అభివృద్ధిపై మూల్యాంకనాలను, సమీక్షలను నిర్వహించాలని, కావున ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీలుగా సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎం. ఓంకారయ్య, సురేష్ వ్యవహరించగా, ఉపాధ్యాయులు వీరస్వామి, బుర్రి శ్రీనివాసు, గోపి భాస్కర్, పుల్లయ్య, ఉపేందర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, ప్రవీణ, సూరమ్మ, అమూల్యా, జ్యోతి, నాగమణి, ఏడుకొండలు, నాగార్జున, శ్రీను మరియు సీఆర్పీ నందిగామ రామారావు తదితరులు పాల్గొన్నారు.












