సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, పర్యాటక రంగంలో 50 వేల కోట్ల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాయికల్ శ్రీ చెన్నకేశవ నాద త్రికుటాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాద త్రికుటాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం అవసరమైన చర్యలు చేపడుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, వైస్ చైర్మన్ సౌజన్య శ్రీదర్ రెడ్డి, ఎమ్మార్వో నాగార్జున, మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, పాక్స్ చైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మండ్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, డిఇఓ రాము, డివైఎస్ఓ రవి, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, మౌనిక, మానస, శ్రీదర్, రాకేష్ నాయక్, మచ్చ గంగ లక్ష్మీ శేఖర్, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, మహేష్ గౌడ్, లత మురళి, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












