జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. హోం మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది.
ఈ కమిటీలో హోం శాఖ మంత్రి చైర్మన్‌గా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాధారణ పరిపాలన () శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాధారణ పరిపాలన () శాఖ ఎక్స్-అఫీషియో సెక్రటరీ, (లా అండ్ ఆర్డర్) సభ్యులుగా ఉంటారు.
అలాగే, గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రముఖ దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్మెంట్ ప్రతినిధి, చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖకు కల్పించారు.
జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.












