రాయికల్, 13 September
గణేష్ చవితి పండుగ సందర్భంగా మండలంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు.
గణేష్ చవితి పండుగ సందర్భంగా ప్రజావాణి వాయిదా రాయికల్ మండల ప్రజలకు ముఖ్య గమనిక. గణేష్ చవితి పండుగను పురస్కరించుకుని, రాయికల్ లో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజావాణి (సమస్యల అర్జీల స్వీకరణ) కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడీవో) చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.స్థానిక ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ఈయన కోరారు.












