జగిత్యాల, 3 September
జిల్లా కార్మిక శాఖ బీడీ కార్మికులకు పెన్షన్ అర్హతలపై కీలక ప్రకటన చేసింది. పీఎఫ్ కట్ అవుతున్న కార్మికులకు మాత్రమే పెన్షన్ వర్తిస్తుందని, రోజుకు 1000 బీడీలు తయారు చేయడంతో పాటు నెలలో 16 రోజులు పనిచేయాలని నిబంధనలు విధించింది.
బీడీ కార్మికులకు పెన్షన్ అర్హతపై కార్మికశాఖ అవగాహనా :బీడీ కార్మికులకు పెన్షన్ పొందెందెందుకు అవసరమైన అర్హతలు.నిబంధనలు కార్మికశాఖ ప్రకటించింది. జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. పెన్షన్ పొందెందుకు పిఎఫ్ కట్ అవుతున్న కార్మికులకే అర్హత ఉంటుందని ప్రకటించారు.రోజుకు కనీసం 1000 బీడీలు చేయాలనీ, నెలలో కనీసం 16 రోజులు తప్పనిసరిగా చేసిన వారే పెన్షన్ కు అర్హులు అని తెలిపారు. అదే విదంగా బీడీ కార్మికులు తమ ఐడి కార్డ్, పిఎఫ్ కార్డ్,రేషన్ కార్డ్ తదితర ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని కార్మిక శాఖ సూచించింది. ఇప్పటి నుండి నిరంతరంగా పిఎఫ్ కట్ కాకపోతే పెన్షన్ కట్ అయ్యే అవకాశం ఉందని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ నిబంధనలకు సంబందించిన పూర్తి వివరాలకు లో వున్న కార్మిక శాఖ కార్యాలయం లో సంప్రదించాలని కోరారు











