Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 11
జగిత్యాల రూరల్ పరిధిలోని చలిగల్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యల కారణంగా తమ పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ మోటర్లు పనిచేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
జగిత్యాల రూరల్ పరిధిలోని చలిగల్ గ్రామంలో విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని, లో వోల్టేజ్ కారణంగా మోటర్లు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలని, లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












